26.6 C
Hyderabad
Monday, August 3, 2026

పంచాయతీ కార్మికులను రెగ్యులర్ చేయండి

Must read

📰 Generate e-Paper Clip

 

లింగంపేట, బతుకమ్మ :

 

గ్రామపంచాయతీల లో పనిచేస్తున్న సిబ్బందిని రెగ్యులర్ చేయాలని, న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరుతూ మండలంలో పనిచేస్తున్న గ్రామ పంచాయతీల సిబ్బంది సోమవారం స్థానిక ఎంపీడీవో నరేష్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ గ్రామ పంచాయతీల ఎంప్లాయిస్ వర్కర్స్  యూనియన్ లింగంపేట మండల అధ్యక్షుడు తంతిరి దత్తురామ్ మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా గ్రామపంచాయ తీలలో  పనిచేస్తున్న సిబ్బందిని వెంటనే పర్మినెంట్ చేసి కనీస వేతనాలు అమలు చేయాలని అన్నారు. జీపీలలో పనిచేస్తున్న సిబ్బందికి ప్రభుత్వo చెల్లిస్తున్న వేతనాలను గ్రీన్ ఛానల్ ద్వారా కార్మికుల అకౌంట్లలో జమ చేయాలని, నెలకు 26 వేల వేతనాన్ని చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికులు ప్రమాదవశాత్తు చనిపోతే వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకి అవకాశం ఇవ్వాలని కోరారు. జీవో నెంబర్ 51ని సవరణ చేసి మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని కారోబార్ బిల్ కలెక్టర్ లకు స్టేటస్ కల్పించాలని కోరారు జిపి కార్మికులు చనిపోతే ప్రభుత్వం 20 లక్షల నష్టపరిహారం అందివ్వాలని అన్నారు. గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న కార్మికులకు, సిబ్బందికి,రూ. 10 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంపీడీవో కు వినతి పత్రం అందించిన వారిలో గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ లింగంపేట మండల ఉపాధ్యక్షుడు వెంకట్ ప్రధాన కార్యదర్శి సంతోష్ కాశిరాం, సభ్యులు నారాయణ, దశరథ్, లక్ష్మణ్, రాజు, బాలయ్య, దేవేందర్, శ్రీశైలం, హరీష్, గైని రాజు, సంజీవులు,,అనిత, గంగమణి, పోశవ్వ, తదితరులు ఉన్నారు.

More articles

Latest article