పంచాయతీ కార్మికులను రెగ్యులర్ చేయండి

  లింగంపేట, బతుకమ్మ :   గ్రామపంచాయతీల లో పనిచేస్తున్న సిబ్బందిని రెగ్యులర్ చేయాలని, న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరుతూ మండలంలో పనిచేస్తున్న గ్రామ పంచాయతీల సిబ్బంది సోమవారం స్థానిక ఎంపీడీవో నరేష్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ గ్రామ పంచాయతీల ఎంప్లాయిస్ వర్కర్స్  యూనియన్ లింగంపేట మండల అధ్యక్షుడు తంతిరి దత్తురామ్ మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా గ్రామపంచాయ తీలలో  పనిచేస్తున్న సిబ్బందిని వెంటనే పర్మినెంట్ చేసి కనీస వేతనాలు అమలు చేయాలని అన్నారు....