విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్స్ లో కాపర్ వైర్ చోరీ

0 9,383

 

. . . రూ. లక్ష యాభై వేలు ఆస్తి నష్టం

 

భిక్కనూరు, బతుకమ్మ :

 

భిక్కనూరు మండలంలోని బస్వాపూర్ గ్రామ శివారులో జైక సమీపంలో ఆదివారం తెల్లవారుజామున విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ చోరీకి గురైంది. గుర్తు తెలియని దుండగులు ట్రాన్స్ ఫార్మర్ ను ధ్వంసం చేసి అందులోని కాపర్ తీగ ఆయిల్ ను అపహరించారు. దీంతో కూరగాయల పంటకు సాగునీరు అందించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ.లక్ష యాభై వేలు నష్టం జరిగినట్లు ఏఈ బాలాజీ తెలిపారు. ఈ సంఘటనపై బస్సాపూర్ సర్పంచ్ తుడుం పద్మ స్వామి ఫిర్యాదు చేయగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. అపహరించిన వారిని త్వరగా గుర్తించి చర్యలు తీసుకోవాలని సర్పంచ్ పద్మ డిమాండ్ చేశారు.

 

Copper wire theft in electrical transformers

Leave A Reply

Your email address will not be published.