నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్‌కు చెందిన ఉందింటి విపుల్ ఉమీత్ రాజ్ భారీ స్థాయి ఎలక్ట్రానిక్ కీబోర్డ్ ఎన్‌సెంబుల్‌లో పాల్గొని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. 2026 మే 29, శుక్రవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న విక్టరీ ఆడిటోరియంలో నిర్వహించిన గిన్నిస్ అచీవర్స్ మీట్ కార్యక్రమంలో ఆయనకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికేట్, పతకాన్ని అందజేశారు.

ఈ పురస్కారాన్ని ఎడబ్య్లూఈ మినిస్ట్రిస్ వ్యవస్థాపకులు బ్రదర్ అనిల్ కుమార్, అలాగే హల్లెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకులు పాస్టర్ ఆగస్టిన్ డండింగి అందజేశారు. 2026 ఫిబ్రవరి 2న హైదరాబాద్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమం ద్వారా ఈ రికార్డు నెలకొల్పబడింది. మొత్తం 22 దేశాలకు చెందిన 2,000 మంది కీబోర్డ్ వాద్యకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారిలో 777 మంది ఎంపికై, అత్యధిక సంఖ్యలో ఎలక్ట్రానిక్ కీబోర్డ్ వాద్యకారులు ఒకే వేదికపై ప్రదర్శన ఇచ్చిన ఎన్‌సెంబుల్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు.

