27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పిల్లలను అనుక్షణం గమనిస్తూ ఉండాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఎస్సై సుహాసిని

 

మెండోరా, బతుకమ్మ :

 

పిల్లలను అనుక్షణం గమనిస్తూ ఉండాలని, వ్యసనాలకు దూరంగా ఉండేలా చూడాలని ఎస్సై సుహాసిని అన్నారు. శనివారం మెండోరా మండలం సోన్ పేట్ గ్రామంలో ఉపాధి హామి కూలీలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, హెల్మెట్ ధరించాలని తెలిపారు. అలాగే పిల్లలు మత్తు పదార్థాలకు, గంజాయి కి బానిస కాకుండా చూసుకోవాలని అన్నారు. వేసవి కాలం కావున పిల్లలు చెరువుల్లో, బావుల్లో ఈతకు వెళ్లి ప్రాణాలు పోగోట్టుకుంటున్నారని, కావున పిల్లల విషయంలో అజాగ్రత్త పనికి రాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తోట నరసవ్వ, మల్కేష్ కాంగ్రెస్ నాయకులు సోన్ పేట్ నారాయణ, బండారి సాయన్న, ఫీల్డ్ అసిస్టెంట్ బాబు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article