27.1 C
Hyderabad
Sunday, August 2, 2026

కాక్రోచ్ జనతా పార్టీని సోషల్ మీడియాలో ఎలా బ్యాన్ చేశారు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు నోటీసు

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

దేశంలో జన్ జి ద్వారా ప్రకంపనలు సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీని సోషల్ మీడియాలో బ్యాన్ చేయడాన్ని దాని అధినేత అభిజిత్ దీప్కే ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ నెలలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి నిరుద్యోగులను, విలేకరులను, సహ చట్టం కార్యకర్తలను బొద్దింకలుగా సంభోదిస్తూ చేసిన వ్యాఖ్యల  నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పుట్టుకొచ్చిన విషయం తెల్సిందే. దేశంలోని జాతీయ పార్టీలను మూడు రోజుల్లోనే అధిగమించి మిలియన్ ఫాలోవర్లను సీజేపీ అందుకున్న విషయం విధితమే. దానితో సీజేపీని కేంద్రం బ్యాన్ చేసింది. దానిని సవాల్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఢిల్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. సీజేపీ పిటిషన్ ను స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఐటీ చట్టం ప్రకారం ఏర్పాటయిన రివ్యూ కమిటీ ముందుకెళ్లాలని అభిజిత్ కు హైకోర్టు సూచించింది.

More articles

Latest article