. . . రేపు కేటిఆర్ ఆధ్వర్యంలో ఈఆర్సికి పార్టీ అభిప్రాయాల వెల్లడి
హైదరబాద్, బతుకమ్మ :
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ‘రైతు డిస్కం’ పేరుతో చేపట్టిన చర్యలను, ఆ నిర్ణయం వెనుక ఉన్న కుట్రలను ప్రజల ముందు ఉంచేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సి) ముందు జరగనున్న ప్రజాభిప్రాయ సేకరణలో, తెలంగాణ రైతాంగం ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తన గళాన్ని వినిపించనుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందం ప్రజాభిప్రాయ సేకరణకు హాజరై, వాదనలను వినిపించనున్నారు. ఈ బృందంలో మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, సీనియర్ నాయకులు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిలతో పాటు ఇతర సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. ‘రైతు డిస్కం’ ప్రతిపాదనల వల్ల రైతాంగానికి, రాష్ట్ర విద్యుత్ రంగానికి వాటిల్లే నష్టాలను ప్రభుత్వ వైఖరిని ఈ సందర్భంగా పార్టీ ప్రతినిధులు కమిషన్ దృష్టికి తీసుకెళ్లనున్నారు.
