27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

కర్ణాటక సీఎం పదవికి సిద్దరామయ్య రాజీనామా

Must read

📰 Generate e-Paper Clip

. . . కర్ణాటకలో అధికార మార్పిడి వేళయింది

. . . గవర్నర్ అపాయింట్ కోరిన సిఎంఓ

. . . శనివారం కొత్త సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం

 వెబ్ డెస్క్, బతుకమ్మ:

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయనున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు సిద్దరామయ్య సీఎం పదవి నుంచి వైదోలుగనున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడే సిద్ధ రామయ్య రెండున్నర సంవత్సరాలు సీఎం పదవి పై ఉండేలా ఒప్పందం ఉందనే చర్చ జరుగుతుంది. గురువారం కర్ణాటక సీఎంఓ  నుంచి గవర్నర్ అపాయింట్ మెంట్ కోరినట్లు తెలిసింది. ఈ నెల 30న కర్ణాటక సీఎంగా డిప్యూటీ సీఎం  డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలిసింది. ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు అధికార మార్పిడి ఖాయమైంది. సిద్ధ రామయ్య తన తనయుడికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. ప్రస్తుతానికి దళిత సామాజిక వర్గానికి చెందిన పరమేశ్వరన్ డిప్యూటీ సీఎం పదవి రేసులో ఉన్నారు.

 కర్ణాటక మంత్రివర్గానికి  సీఎం సిద్దరామయ్య అల్పాహార విందు..

బెంగళూరులోని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నివాసంలో  గురువారం ఉధయం జరిగిన బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ హాజరుకాగా, ఇరువురు నేతల మధ్య అత్యంత ఆత్మీయ వాతావరణం కనిపించింది. సమావేశం సందర్భంగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ ఒకరినొకరు ఆత్మీయ ఆలింగనం చేసుకోగా, అనంతరం సిద్ధరామయ్యకు డీకే శివకుమార్‌ పాదాభివందనం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.

Siddaramaiah resigns as Karnataka CM

More articles

Latest article