26.6 C
Hyderabad
Monday, August 3, 2026

టిఫిన్ బాక్సులు పంపిణీ చేసిన అధికారులు

Must read

📰 Generate e-Paper Clip

 

లింగంపేట్, బతుకమ్మ :

 

లింగంపేట్ మండలం శెట్టిపల్లి గ్రామంలో మంగళవారం టిఫిన్ బాక్స్ లను అధికారులు పంపిణీ చేశారు. ప్లాస్టిక్ రహిత గ్రామంగా మార్చడానికి అధికారులు షట్ పల్లి గ్రామాన్ని ఎంపిక చేశారు. షట్ పల్లి గ్రామంలో ప్లాస్టిక్ స్వీకరించిన వారికి కిలో ప్లాస్టిక్ కి టిఫిన్ బాక్స్ పంపిణీ చేశారు. సోమవారం పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా గ్రామానికి చెందిన పలువురు ప్లాస్టిక్ సేకరించి తీసుకువచ్చి పంచాయతీ కార్యాలయంలో అప్పగించారు. హోటల్ లో ప్లాస్టిక్ గ్లాసుల వినియోగం తగ్గించాలని యజమానులకు సూచించారు. ఈ సందర్భంగా హోటల్ యజమానులకు గాజు గ్లాసులను పంపిణీ చేశారు. ప్లాస్టిక్ సేకరించే గ్రామస్తులకు ఎంపీడీవో నరేష్, గ్రామ సర్పంచ్ అట్టెం శ్రీనివాస్ యాదవ్, ఉప సర్పంచ్ మన్నే బాలయ్య, పంచాయతీ కార్యదర్శి రవి, వార్డు సభ్యులు అంజా గౌడ్, లింగాగౌడ్, ఆంజనేయులు, అశోక్, లక్ష్మీ నారాయణ, దుర్గవ్వ, రుక్మవ్వ, రాజమణి, పద్మ, ఐకెపి సీసీ గంగరాజమ్, వెంకట్ రెడ్డితో పాటు గ్రామస్తులు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.

More articles

Latest article