27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనాలను పెంచాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షులు భూమన్న

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

సుప్రీంకోర్టు తీర్పుని రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని కనీస వేతనాలు పెంచాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బి.భూమన్న తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఐఎఫ్ టియు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుమారు దశాబ్దిన్నర కాలం తర్వాత అయినా కనీస వేతనాలు పెంచినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ పెంపుదల చేస్తున్నప్పుడు సుప్రీంకోర్టు కనీస వేతనం రూ.26 వేల రూపాయలు ఉండాలని 2016 లో ఇచ్చిన తీర్పుని గమనంలో ఉంచుకున్నట్టు లేదని, ఏళ్ల తరబడిగా పలు హైకోర్టులలో పెండింగ్లో ఉన్నటువంటి దానిని సుప్రీంకోర్టు బాధ్యత తీసుకొని 2016 అక్టోబర్ లో కనీస వేతనం రూ.26 వేలు ఉండాలని తీర్పునిచ్చిందన్నారు. ఈ తీర్పును పట్టించుకోకపోవడం అత్యంత శోచనీయమని, అదే విధంగా ఆక్ట్రాయిడ్ ఏదైతే సూచన చేశాడో ఆ సూచనలు కూడా ఇక్కడ విస్మరించారని అభిప్రాయపడుతున్నామన్నారు. ఆక్ట్రాయిడ్ ఇచ్చిన ప్రమాణాల ప్రకారం కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి ఎం.శివకుమార్, ముల్లె హమాలీ అధ్యక్షుడు ఎం మోహన్, నాయకులు బి. శంకర్, రమేష్, తొంపే రాజు, దాసు, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article