కామారెడ్డి, బతుకమ్మ: జిల్లా కేంద్రంలోని మున్సిపల్ రోడ్డు వెళ్లే దారిలో ఉన్న శివం ఎలక్ట్రికల్ షాప్ లో కొంతమంది మందుబాబులు వీరంగం సృష్టించారు. షాప్ యజమాని తట్ల బాలేందర్ చక్రధర్ శివరాజ్ పై దాడి చేశారు. మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. షాపు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో దాడి చేశారా? లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
