27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

అక్రమంగా మట్టి తరలింపుపై ప్రతిపక్ష నేతల ఆగ్రహం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మట్టి తరలింపును ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

ఎలాంటి అనుమతులు లేకుండా, అధికార పార్టీ నేతల అండదండలతోనే ఎల్లయ్య చెరువులో అక్రమంగా మట్టి తరలింపు జరుగుతోందని ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఆదివారం ఎల్లయ్య చెరువుపై ప్రతి పక్ష పార్టీల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బాన్సువాడ మున్సిపాలిటీ కు చెందిన ఏడుగురు ప్రతిపక్ష కౌన్సిలర్లు అధ్యక్షత వహించారు. ఎల్లయ్య చెరువు సుందరీకరణ పేరుతో చెరువులోని మట్టిని రైతులకు కాకుండా ఇటుక బట్టీలకు, ప్రైవేట్ వెంచర్ లకు, చెరువు పక్కన ఉన్న ప్లాట్ లకు వందల కొద్దీ టిప్పర్లలో అమ్ముకుంటున్నారని నాయకులు ఆరోపించారు. ఇదేనా మీ అభివృద్ధి అని అధికార పార్టీ నేతలను ప్రశ్నించారు.

. . . అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం

ఈ అంశంపై బాన్సువాడ ఆర్డీవోకు, ఇరిగేషన్ అధికారులకు వినతిపత్రం ఇచ్చినా పట్టించుకోలేదని ప్రతిపక్ష కౌన్సిలర్లు తెలిపారు. నిన్న కలెక్టర్ కి వినతిపత్రం అందజేసినప్పటికీ అధికార పార్టీ నాయకుల టిప్పర్లు యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ, మైనింగ్, నీటి పారుదల శాఖ అధికారులు దీనిని అడ్డుకోవడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. కలెక్టర్, ఆర్డీవో వెంటనే మట్టి తరలింపును ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అఖిలపక్ష నేతలు హెచ్చరించారు. నిజంగా అభివృద్ధి కావాలంటే రైతుల పొలాల్లో మట్టి పంపండి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అంజిరెడ్డి, నార్ల రత్నకుమార్, బాడీ శ్రీను, అతిఫ్ అజీమ్, టిఆర్ఎస్ నేత మామిళ్ల రాజు, బీజేపీ నాయకులు శంకర్ గౌడ్, తుప్తి ప్రసాద్, అనిల్, టీడీపీ నాయకులు శంషుద్దీన్, ఏడుగురు ప్రతిపక్ష కౌన్సిలర్లు ఖలీల్, ఫెరోజ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article