26.6 C
Hyderabad
Monday, August 3, 2026

స్వయంగా లారీలను ఆపి ధాన్యం లోడ్ చేయించిన ఎమ్మెల్యే

Must read

📰 Generate e-Paper Clip

 

గంగాధార, బతుకమ్మ :

 

వరి కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత ఏర్పడి కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు చేరక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అధికార యంత్రాంగం ధాన్యం మిల్లులకు తరలింపుకోసం లారీలను పంపుతున్నా లోడింగ్, అన్ లోడింగ్ సమస్యలు తప్పడం లేదు.

 

MLA personally stopped lorries and loaded them with grain

 

రైతులు కళ్ళాల వద్ధ ధాన్యం రాశులకు కాంటాలను (తూకం) వేసిన తరలింపులో జాప్యం చెడగొట్టు వానలతో బెంబే లేత్తుతుండటం చూసిన చోప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం స్వయంగా రోడ్డు వెంట వెలుతున్న లారీలను ఆపి యాజమాన్యాలతో మాట్లాడి ధాన్యంను మిల్లింగ్ కు తరలింపునకు చొరవ చూపారు.

 

MLA personally stopped lorries and loaded them with grain

 

ఆదివారం గంగాధర మండలంలోని వరి కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత ఏర్పడి కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు చేరక రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కరీంనగర్ జగిత్యాల హైవే మీదుగా వెళుతున్న లారీలను మంగపేట చెక్ పోస్ట్ వద్ద ఆపి ధాన్యం రవాణాకు సహకరించాలని చొప్పదండి శాసనసభ్యులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం ఒప్పించారు.

 

MLA personally stopped lorries and loaded them with grain

More articles

Latest article