25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ట్రాక్టర్ ఢీకొని యువకుడు మృతి

Must read

📰 Generate e-Paper Clip

 

భిక్కనూరు, బతుకమ్మ :

 

భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామ శివారులో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్, బైకు ఢీకొన్న ప్రమాదంలో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా నందిగామకు చెందిన వీరబోయిన కార్తీక్ (25) సొంత పనులపై ఇస్సానగర్ వెళ్లి వస్తుండగా పెద్దమల్లారెడ్డి, ఇస్సన్న పల్లి మూలమలుపు దగ్గర ట్రాక్టర్ ఢీకొన్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో కార్తీక్ తలకు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా దావఖానకు తరలించినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. మృతునికి భార్య ఒక పాప ఒక బాబు ఉన్నట్లు సమాచారం.

More articles

Latest article