25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

జిల్లా సెంట్రల్ జైలులో “మూలాఖత్ లీగల్ ఎయిడ్ హెల్ప్ డెస్క్” ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :

 

జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్ర కారగారంలో మూలాఖత్ లీగల్ ఎయిడ్ హెల్ప్ డెస్క్ ను సంస్థ డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ జి ఉదయ కృష్ణ, సబ్ జైలర్ మన్మధ రావు తో కలిసి ప్రారంబించారు. ఈ సందర్బంగా ఉదయ కృష్ణ మాట్లాడుతూ జైలులో ఉన్న ఖైదీలను కలవడానికి వచ్చే వారి కోసం హెల్ప్ డెస్క్ హెల్ప్ ఫుల్ గా తెలిపారు. జ్యూడిషియల్ రిమాండ్ ఉన్న ఖైదీలు, కోర్టుల ద్వారా శిక్షకు గురి కాబడిన ఖైదీల బంధుమిత్రులు మూలాఖత్ కు రావడం జరుగుతుందని వారికి ఎలాంటి ఇబ్బదులు లేకుండా ఖైదీలతో మూలాఖత్ కు వీలు కల్పిస్తామని అన్నారు. ఖైదీలకు, వారిని చూడటానికి వచ్చేవారికి సందానకర్తగా ఉండి హెల్ప్ డెస్క్ పని చేస్తుందని పేర్కొన్నారు.మూలాకత్ కు వచ్చే వారిలో అత్యధికులు నిరక్షరాస్యులు ఉంటారని వారికి మూలాకత్ దరఖాస్తు నింపి సహాయం చేస్తామని ఆయన తెలిపారు.ఇంకా ఏదైనా న్యాయ సహాయం అందిచడానికి సహాయకారులుగా హెల్ప్ డెస్క్ ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. జైలు మూలాకత్ గదిలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.మూలాకత్ లీగల్ ఎయిడ్ హెల్ప్ డెస్క్ లో ఇద్దరు న్యాయసేవ సంస్థ ప్యానల్ న్యాయవాదులు,జైలర్, మరో ముగ్గురు పారా లీగల్ వాలంటీర్స్ సభ్యులుగా ఉంటారని ఆయన వివరించారు.హెల్ప్ డెస్క్ ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ మహమ్మద్ షాదుల్ల, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ శుభం,ప్యానల్ న్యాయవాదులు లక్ష్మి నారాయణ, ప్రతిభ తదితరులు పాల్గొన్నారు

 

"Moolakhat Legal Aid Help Desk" launched at District Central Jail

More articles

Latest article