25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

మామ మృతికి కారణమైన అల్లుడికి పదేళ్ల జైలుశిక్ష

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ లీగల్, బతుకమ్మ

 

మామ మృతికి కారణమైన అల్లుడికి పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విదిస్తూ నిజామాబాద్ నాల్గవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి దారావత్ దుర్గా ప్రసాద్ గురువారం యాబై ఆరు పేజీల తీర్పు వెలువరించారు. నిజామాబాద్ రూరల్ పోలీసులు కోర్టుకు సమర్పించిన అభియోగ పత్రం ఆదారంగా కోర్టు నేర న్యాయ విచారణలో మొత్తం 13 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసి, 11 ధ్రువీకరించుకున్న పత్రాలు, 4 వస్తుగత సాక్ష్యాలు పరిగణలోకి తీసుకుని ప్రాసిక్యూషన్, డిఫెన్స్ న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు. చత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన రాజేంద్ర మారవి తన పెద్దనాన్న బిలమ్ సింగ్ మారవి, బిలమ్ కూతురు గోమతి దుర్వె ఆమె భర్త రాజేష్ దుర్వె ఇతరులతో కలిసి నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణంలో బతుకు తెరువు కోసం వచ్చి స్థిరపడ్డారు. కొంత కాలానికి క్రాంట్రాక్టర్ తిమ్మసముద్రం కృష్ణ ప్రోద్బలం మేరకు నిజామాబాద్ రూరల్ మండలం అనంతగిరి గ్రామ శివారు దగ్గర నిర్మాణంలో ఉన్న ఒక గోదాంలో కూలి పని చేయడానికి వచ్చి గుడిసెలలో నివసించే వారు. రాజేష్ దుర్వె చీటికీ మాటికీ తన భార్య గోమతి ని కొట్టడం చేసేవాడు. కన్నబిడ్డనే కళ్ళ ముందు కొడుతున్న అల్లుడిని మామ బిలమ్ సింగ్ మందలించేవాడు.ఇద్దరు పిల్లలు ఉన్నారు మద్యం తాగవద్దని నచ్చజెప్పేవాడు. అయినా అల్లుడి తీరు మారేది కాదు. అమావాస్య కావడంతో 27 ఏప్రిల్, 2025 న కూలీ పనికి సెలవు కావడంతో రాజేష్ మద్యం సేవించి భార్యతో గొడవ పెట్టుకున్నాడు. నచ్చజెప్ప పోయిన మామ బిలమ్ సింగ్ ను కొట్టి కింద పడవేసి ఇటుకతో ముఖంపైన, కుడిఎడమ కన్నుల పైన, గదవ పైన, తలపైన బలంగా కొట్టి తీవ్రగాయాలపాలు చేయడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఇటుక మూడు ముక్కలై పోయింది. సదరు నేర అభియోగాలు రుజువు కావడంతో బిలమ్ సింగ్ మృతి చెందడానికి కారణమైన రాజేష్ కు పది సంవత్సరాల కఠిన జైలుశిక్షతో పాటు రెండు వేళ రూపాయల జరిమానా విదిస్తూ జడ్జి దుర్గా ప్రసాద్ తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని యెడల అదనంగా ఆరు నెలలు సాధారణ జైలుశిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు.

More articles

Latest article