26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రారంభమైన సరస్వతి నది అంత్య పుష్కరాలు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పుణ్య స్నానం ఆచరించిన కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి

. . . పాల్గొన్న మంత్రులు కొండా సురేఖ… దుద్దిళ్ల  శ్రీధర్ బాబు

 కాళేశ్వరం, బతుకమ్మ:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామీ దేశ స్థానం లోని త్రివేణి సంగమ క్షేత్రం వద్ద అంతర్వాహినిగా ప్రవహిస్తుంది అని పేరుగాంచిన సరస్వతి నది అంత్య పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పుష్కరాల తొలి రోజు గురువారం ఉదయం 5.43 గంటలకు పవిత్ర సంగంలో తొలి పుష్కర స్నానం నిర్వహించబడింది. ఈ పుణ్యస్నానాన్ని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వాములు, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ధార్మిక సలహాదారు గోవింద హరి తదితరులు ఆచరించారు.అలాగే భూపాలపల్లి, రంగారెడ్డి నియోజకవర్గాల శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, మల్ రెడ్డి రంగారెడ్డి పుష్కర స్నానంలో పాల్గొన్నారు.పుష్కరాల సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చి పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. భద్రత, పారిశుధ్యం, తాగునీరు, వైద్య సేవలు, రవాణా వంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు.ఈ పుణ్యకాలంలో భక్తులు సౌకర్యవంతంగా, సురక్షితంగా పుష్కర స్నానాలు నిర్వహించుకునేలా అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.

Saraswati's funeral processions have begun

More articles

Latest article