29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

రోడ్డు ఎక్కిన రైతన్నలు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్ జామ్

 

రాజంపేట, బతుకమ్మ :

 

రాజంపేట్ మండలంలోని కొండాపూర్ గ్రామంలో జొన్న పంట కొనుగోలు పరిమితిని ఎకరాకు 10 క్వింటాళ్ల నుంచి 20 క్వింటాళ్ల వరకు పెంచాలని డిమాండ్ చేస్తూ బుధవారం రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. మండే ఎండను సైతం లెక్కచేయకుండా రోడ్డుపై జొన్నలు పోసి నిరసన వ్యక్తం చేశారు. గత సంవత్సరం ఎకరాకు 14 క్వింటాళ్ల వరకు జొన్నలు కొనుగోలు చేశారని, ఈ సంవత్సరం కేవలం 10 క్వింటాళ్లకు పరిమితం చేయడం అన్యాయమని రైతులు మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు పరిమితిని 20 క్వింటాళ్ల వరకు పెంచే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. రైతుల ధర్నాతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు రెండు గంటలపాటు ట్రాఫిక్ పూర్తిగా స్థంభించింది. సమాచారం అందుకున్న ఎమ్మార్వో జానకి, సర్పంచ్ కృష్ణ, మండల వ్యవసాయ అధికారి జోత్స్న ప్రియదర్శిని, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రైతులు వినతిపత్రం అందిస్తే కలెక్టర్, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం రైతుల వద్ద నుండి వినతిపత్రం స్వీకరించడంతో రైతులు ధర్నా విరమించారు.

More articles

Latest article