27.3 C
Hyderabad
Friday, July 31, 2026

తూనికల కొలతల్లో మోసాలు జరగకుండా చూడాలి

Must read

 

. . . జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం చైర్మన్ మాయావార్ రాజేశ్వర్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

తూనికల కొలతల్లో మోసాలు జరగకుండా చూడాలని జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం చైర్మన్ మాయావార్ రాజేశ్వర్ అన్నారు. నిజామాబాద్ లో గల గాంధీ గంజ్ పాత గంజులో బుధవారం లీగల్ మెట్రాలజీ తూనికల కొలతల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాయావార్ రాజేశ్వర్, జిల్లా లీగల్ మెట్రాలజీ ఇన్స్ పెక్టర్ సుజాత అలీ, లీగల్ మెట్రాలజీ సిబ్బంది తదితరులు పాల్గొని తూనికల కొలతల గురించి వినియోగదారులకు, కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు. వినియోగదారులకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం గంజ్ లో గల షాపులలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా చప్పన్ భోగ్ మిఠాయి బండార్ ని తనిఖీ చేసి, వినియోగదారులకు కల్తీ లేని మిఠాయిలు విక్రయించాలని సూచించారు. ఈ తనిఖీలలో లీగల్ మెట్రోలజి సిబ్బంది, గంజ్ లోని వినియోగదారులు, తదితరులు పాల్గొన్నారు.

 

Fraud in weighing must be prevented.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article