30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

జిల్లాజడ్జి”భారతమ్మ”కు పిపి, న్యాయవాదుల అభినందల హర్షార్థిరేఖలు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం దేగాం గ్రామ శివారులో ఇటుక కార్మికుల కష్టాల కడగండ్లు తీర్చిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ జీవిఎన్ భారత లక్ష్మీ ని జిల్లా సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్ ఎస్ ఎల్ గౌడ్ బుధవారం జిల్లాకోర్టు సముదాయంలోని ఆమె ఛాంబర్ లో కలిసి పూలగుచ్చం అందజేసి, శాలువతో అభినందనలు తెలిపారు. దేగాం ఇటుక కార్మికులకు చట్టబద్ధమైన హక్కులు కల్పించడంలో జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చరిత్రలో కలికితురాయిగా నిలుస్తుందని వారు అన్నారు. మిట్ట మధ్యాహ్నం మండుటెండలో దాదాపు రెండున్నర గంటలు కార్మికులతో గడిపి వారి సాధక భాధకాలు తెలుసుకుని పరిష్కార దిశగా వెళ్లిన తీరుతో బాధిత కార్మికులకు భారీ ఊరట లభించి వారి వారి ఊర్లకు వెళ్లే మార్గం చూపించారని అన్నారు. కష్టజీవుల కష్టార్జీతానికి కనీస విలువలు దక్కని చోట మేమున్నామంటూ న్యాయసేవ సంస్థ ముందడుగు వేయడం న్యాయాన్ని ఆశిస్తున్న ఎందరో బక్కపలచని ప్రాణాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని రెడ్డి, గౌడ్ అన్నారు. జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ నాల్సా అందిస్తున్న ప్రేరణనే ముందుకు నడిపిస్తున్నదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మీ అన్నారు. ధనస్వామ్యం చేతలలో దహించుకుపోతున్న సామాన్యులకు న్యాయసేవ సంస్థ తరపున చేతినైనంత కాడికి చేయూతను అందిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.

More articles

Latest article