27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

బతుకమ్మ ఎఫెక్ట్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నిజామాబాద్ ఎగ్జిబిషన్ బంద్

 

. . . ఈరోజు బంద్ అంటూ పోస్టర్ల అతికింపు

 

. . . భద్రత ప్రమాణాలు గాలికి వదిలేయడంపై పోలీస్ శాఖ సీరియస్

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న 43వ ఇండస్ట్రియల్ అండ్ అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ మూత పడింది. ఈరోజు బంద్ అంటూ మంగళవారం  ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద పోస్టర్లను అతికించారు. ఇటీవల బతుకమ్మ పత్రికలో వరుసగా ప్రచురితమైన కథనాలకు స్పందన వచ్చింది. నగరంలో ని పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో జరిగిన ఘటనలపై బతుకమ్మ వరుసగా కథనాలను రాసింది. దాంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. పాలిటెక్నిక్ మైదానంలో నిర్వహిస్తున్న నుమాయిష్  లో సందర్శకుల భద్రతను నిర్వాహకులు గాలికి వదిలేసారు అన్న ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. గుండెపోటుతో ఒకరు మరణించగా.. క్రేజీ వీల్ ట్రాలీ విరిగిపడి ఇద్దరికీ తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. పోలీస్ శాఖ ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వాహకులకు  భద్రత ప్రమాణాల విషయంలో సూచనలు చేసినట్టు సమాచారం.

 

Bathukamma effect

 

ఎప్పటిలాగే ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చిన సందర్శకులకు ఎగ్జిబిషన్ ప్రధాన గేటు వద్ద ఈరోజు ఎగ్జిబిషన్ బంద్ అనే పోస్టర్లను చూసి వెనుదిరిగి వెళ్తున్నారు. ఈ వరుస సంఘటనలపై ఎగ్జిబిషన్లో సందర్శకులకు, సౌకర్యాలు భద్రత ఏర్పాట్లపై పోలీస్ శాఖ ఆరా తీశారు. ఎగ్జిబిషన్ కు వచ్చే సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌక ర్యాలను మెరుగుపరుస్తూ భద్రత ఏర్పాట్లపై ప్రత్యేక చర్యలు తీసుకున్న అనంత రమే ఎగ్జిబిషన్ పునః ప్రారం భించాలని పోలీస్ శాఖ సూ చించినట్లు తెలుస్తుంది. ఎగ్జిబిషన్ కు వచ్చే సందర్శకులకు ఆహ్లాదం సంగతి దేవుడెరుగు… భద్రతా పూర్తిగా కరువైన ట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంత పెద్ద ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నటువంటి ఎగ్జిబిషన్ సొసైటీ ఏదైనా అనుకోని సంఘటన జరిగితే… అత్య వసర వైద్య సేవలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యతను మరిచారు. ఒక ఘటన జరిగిన వెంటనే పట్టించు కోవాల్సిన ఎగ్జిబిషన్ సొసైటీ సందర్శకుల భద్రతను గాలికి కోదిలే సింది. అంతేకాకుండా ఎగ్జిబిషన్లో కనీస సౌకర్యాలు కరువైనట్లు తెలుస్తుంది. మంగళవారం మాత్రం ఒకరోజు ఎగ్జిబిషన్ బంద్ ఉన్నట్లు ప్రధాన గేటు వద్ద కరపత్రాన్ని ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ పున: ప్రారంభమయ్యేనా. ఎగ్జిబిషని చూడడానికి వచ్చిన సందర్శ కులకు మాత్రం జనరేటర్ పాడయింది అని కొంత అంతరాయ లోపం ఉందని ఎగ్జిబిషన్ సొసైటీ కుంటి సాకులు చెప్పడం విడ్డూరం.. 24 గంటల్లో ఎగ్జిబిషన్ కేంద్రంలో ఎలాంటి భద్రత ప్రమాణాలు ఏర్పాటు చేస్తారు. అత్యవసర వైద్య సేవలకు ఎలాంటి ఏర్పాటు చేస్తారని చర్చ జరుగుతోంది. బుధవారం ఎగ్జిబిషన్ తిరిగి ప్రారంభమవుతుందా అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

 

Bathukamma effect

More articles

Latest article