. . . 145 గ్రాముల బంగారు ఆభరణాలు.. ఐదు కిలోల వెండి స్వాధీనం
. . . 42 లక్షల విలువైన సొత్తు రికవరీ
కామారెడ్డి, బతుకమ్మ:
కామారెడ్డి పోలీసులు అంతర్ రాష్ట్ర దొంగ ఠాకూర్ జగన్ సింగ్ అలియాస్ దినేష్ సింగ్ అలియాస్ డీజే డానీని అరెస్టు చేసి పట్టణంలో విద్యానగర్ కాలనీలో జరిగిన భారీ చోరీ కేసును చేదించారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర విలేఖరులతో మాట్లాడుతూ.. కరీం నగర్ కు చెందిన డిజే జానీ చోరి కేసులు బంగారాన్ని ముంబాయిలో విక్రయించేందుకు ప్రైవేటు బస్సులో వెలుతున్నారని సమాచారం సోమవారం పట్టుకున్నట్టు ఎస్పీ తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 11న కామారెడ్డి పట్టణంలో విద్యానగర్ కాలనీ శ్రీ సాయి రెసిడెన్సి అపార్ట్మెంట్ లో అడ్డ గుల్ల బాల క్రిష్ణ కుటుంబ సమేతంగా ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లాడు. అతని ఫ్లాట్ తాళాలు పగులగొట్టి 333 గ్రాముల బంగారు ఆభరణాలు,10.290 కిలోల వెండి, లక్ష నగదు చోరీ చేసినట్లు పోలీసులు ఫిర్యాదు అందినట్టు తెలిపారు. చోరి కేసు చెదనకు కామారెడ్డి డిఎస్పీ మధు సుధన్, పట్టణ సీఐ నరహరి, సీసీఎస్ సీఐ రామాన్ ఎస్సైల ఆధ్వర్యంలో నాలుగు టీంలను ఏర్పాటు చేసి గాలించినట్లు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు డిజే డానీని అరెస్ట్ చేసి అతని వద్ధ 145 గ్రాముల బంగారు ఆభరణాలు.. ఐదు కిలోల వెండి స్వాధీనం చేసుకున్నామని దీని విలువ రూ. 42 లక్షల విలువైన సొత్తు రికవరీ చేసినట్లు తెలిపారు.డిజే డానీపై కరీం నగర్, సైదాబాద్, వరంగల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి పరిధిలో 32 కేసులు ఉన్నాయని తెలిపారు. బారి చోరీ కేసును చెదించి మోస్ట్ వాంటేడ్ డిజే డానీనీ అరెస్టు చేసిన కామారెడ్డి పోలీసులకు రివార్డు ఇవ్వనున్నట్టు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

