30.9 C
Hyderabad
Monday, August 3, 2026

ఈనెల 20 నుంచి జూన్ 20 వరకు జెండా పండుగ నిర్వహించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . (టీఆర్ఎస్) జెండా గద్దె మోడల్ ను ఆవిష్కరించిన పార్టీ చీఫ్ కవిత

హైదరాబాద్ , బతుకమ్మ:

ఈనెల 20 నుంచి జూన్ 20 వరకు టీఆర్ఎస్ జెండా పండుగ నిర్వహించాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ శ్రేణులకు చీఫ్ కల్వకుంట్ల కవిత సూచించారు. బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన స్టేట్ జనరల్ బాడీ సమావేశంలో సోమవారం జెండా గద్దెల మోడల్ ను ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ…రాష్ట్రవ్యాప్తంగా ఒకే మోడల్ లో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) జెండా గద్దెలు నిర్మిస్తున్నామని తెలిపారు.మూడు ఫీట్ల ఎత్తు, రెండు ఫీట్ల వెడల్పు తో పార్టీ జెండా గద్దెలు నిర్మించాలని సూచించారు. పార్టీ జెండా గద్దె బేస్ ఒక ఫీట్ ఎత్తులో ఉంటుంది పైభాగం మరో రెండు ఫీట్ల ఎత్తులో ఉంటుందని తెలిపారు. జెండా గద్దె బేస్ కు గ్రీన్ కలర్.. పై భాగంలో ఉండే జెండా గద్దె కు ఎల్లో కలర్, దాని మధ్యలో తెలంగాణ మ్యాప్ బ్లూ కలర్ లో ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణ మ్యాప్ మధ్యలో ఇంగ్లీష్ అక్షరాల్లో టీఆర్ఎస్ అని రాయాలని ,  జెండా గద్దె బేస్ గ్రీన్ కలర్ మధ్యలో తెలుగులో తెలంగాణ రక్షణ సేన అని రాయాలని సూచించారు పార్టీ జెండా కలర్ కోడ్స్ కూడా తాము ఇచ్చిన విధంగానే చూసుకోవాలి.. అప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా జెండాలన్నీ ఏకరూపంలో ఉంటాయని వెల్లడించారు.

 

Flag Festival to be held from 20th of this month to 20th of June

More articles

Latest article