మోర్తాడ్, బతుకమ్మ :
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యనభ్యసించిన గ్రామీణ ప్రాంత విద్యార్థులలో ప్రతిభను వెలికి తీసి తీర్చిదిద్దామని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పెద్దన్న అన్నారు. ప్రజా పాలన ప్రగతి పాలన విద్యా వారోత్సవాల ముగింపు సమావేశం మోర్తాడ్ మండల లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఏ గ్రూప్ లో రచన, రిత్విక్, బీకాం అనూజ, సరస్వతి, బీఎస్సీ ఎంపీసీఎస్ నవ్య శ్రీ, భవ్య శ్రీ, బీఎస్సీబి జెడ్ సి శ్రీజ, అంజలి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అలాగే జాతీయస్థాయిలో పథకాలు సాధించిన మదన్, శివాని క్రీడాకారులను శాలువలతో సన్మానించి, మెమొంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మర్రిపల్లి భూపతి, కోఆర్డినేటర్ డాక్టర్ దశరథ్, సీనియర్ అధ్యాపకులు రాజయ్య, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
