25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ధరల పెంపుతో సామాన్యుడి బతుకు ఆగమాగం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్, నిత్యావసరాల ధరలపై ఆమ్ ఆద్మీ పార్టీ పోరుబాట

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల వల్ల దేశంలో, రాష్ట్రంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలు బ్రతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆమ్ ఆద్మీ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సమీర్ అహ్మద్ తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు పన్నుల రూపంలో ప్రజల రక్తాన్ని పిండుకుంటున్నాయని, ఇంధన ధరల నుండి మొదలుకొని రోజువారీ తినే ఆహార వస్తువుల వరకు అన్నింటినీ సామాన్యుడికి దూరం చేస్తున్నాయని నాయకులు మండిపడ్డారు. ఈ సమావేశంలో జిల్లా మైనారిటీ అధ్యక్షులు అజహర్ ఉద్దీన్, రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్  జుబేర్ అహ్మద్, సీనియర్ నాయకులు అబ్దుల్ ఖదీర్, సీనియర్ నాయకులు శ్రీనివాస్, డిచ్ పల్లి మండల ప్రెసిడెంట్ మహమ్మద్ మక్సూర్, ఘన్పూర్ ప్రెసిడెంట్ షేక్ జాకీర్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article