25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

గ్రంథాలయాలే జ్ఞాన బాండాగారాలు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపాల్ పి.రామ్మోహన్ రెడ్డి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

గ్రంథాలయాలే అత్యుత్తమ జ్ఞాన బాండాగారాలని గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపాల్ పి.రామ్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం గిరిరాజ్ కళాశాలలో ప్రజాపాలన కార్యక్రమంలో ని విద్యావారోత్సవాల్లో భాగంగా 5 వ రోజు మన గ్రంథాలయ జ్ఞానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పుస్తక ప్రదర్శనతో పాటు, నిత్యం గ్రంథాలయాలను ఉపయోగించుకున్న విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా సన్మానించారు. సమన్వయకర్త, గ్రంథాలయ అధికారి పూర్ణ చందర్ రావు ఆధ్వర్యంలో వివిధ అధ్యాపకులు రచించిన గ్రంథాలను, పాఠ్య పుస్తకాలను ఆవిష్కరించారు.

 

Libraries are the reservoirs of knowledge.

 

పుస్తకపఠనం ప్రాధాన్యతలను రామస్వామి, రమేష్ గౌడ్ తదితర అధ్యాపకులు వివరించారు. పుస్తక పఠనం ఉత్తమ వ్యక్తిత్వాన్ని, సృజనాత్మకతను నేర్పిస్తుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్ రంగరత్నం, ఏ.వో.రామ్ కిషన్, సమన్వయకర్తలు రాజేశ్, వినయ్ కుమార్, దండు స్వామి, బాలామణి, రామస్వామి, పూర్ణచందర్ రావు, కిరణ్ కుమార్ గౌడ్, ముత్తెన్న, అధ్యాపకులు నహీదా బేగం, రామక్రిష్ణ, ప్రతిభ, రంజిత్, రాము, షేక్ చాంద్, పండిత్ రావు, నరేష్, కార్యాలయ, గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

 

Libraries are the reservoirs of knowledge.

More articles

Latest article