మోర్తాడ్, బతుకమ్మ :
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధతో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్య అన్నారు. మోర్తాడ్ మండలం లోని శెట్ పల్లీ గ్రామంలో గురువారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించి ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తున్న ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలు, భోజన సదుపాయం, అధునాతన టెక్నాలజీతో తెరపై విద్యార్థులకు పాఠాలు బోధించడం జరుగుతుందని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కిరణ్, ఉపాధ్యాయ బృందం, గ్రామ యువకులు గురజాల నర్సారెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
