27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయం

Must read

📰 Generate e-Paper Clip

 కామారెడ్డి జిల్లా  అధ్యక్షులు రూసేగం భూమయ్య మాదిగ 

 బాన్సువాడ, బతుకమ్మ : ఎస్సీ వర్గీకరణ  అమలుకు   ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని  కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రూసేగం భూమయ్య మాదిగ అన్నారు. బాన్సువాడ పట్టణంలో ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం సోమవారం ఏర్పాటు చేశారు  ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మాదిగ మాట్లాడుతూ  ఎస్సీ వర్గీకరణ అంశం పూర్తి అయ్యేవరకు ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేపట్టరాదని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తానని నిండు అసెంబ్లీలో చెప్పి ఎన్ని అడ్డంకులు ఎదురైనా మాదిగ జాతికి అండగా ఉంటానని హామీ ఇచ్చారని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మాదిగ, మాదిగ ఉప కులాలకు ఎలాంటి అన్యాయం జరగకుండ ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న ఉద్యోగ నియామకాలు నిలుపుదల చేయాలని డిమాండ్ చే శారు.  తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా ఉన్న ఈ కమిటీ అన్ని జిల్లాలలో అధ్యయనం చేసి ఎస్సీ స్థితిగతుల పైన సమగ్ర సర్వే నిర్వహించి అన్ని ఎస్సీ లో వున్న అన్ని కులాలకు న్యాయం జరిగే విధంగా సభ్య కమిషన్ చొరవ తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీ పక్షాన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షులు కంతి పోచిరం మాదిగ,రాష్ట్ర మహిళా వర్కింగ్ అధ్యక్షురాలు పోసాని, నిజామాబాద్ టౌన్ అధ్యక్షులు సుధాకర్ మాదిగ, నర్సింగరావు మండల అధ్యక్షులు సర్వగల రవీందర్ మాదిగ,నిజామాబాద్ నగర అధ్యక్షురాలు సమాధాన కమిటీ అనిత గంగమని,సాయిలు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article