27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

కానిస్టేబుల్ పై లైంగిక దాడి చేసిన కీచక ఎస్ఐ సస్పెండ్

Must read

📰 Generate e-Paper Clip

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

తోటి మహిళా కానిస్టేబుల్ పై లైంగిక దాడికి పాల్పడి పరారీలో ఉన్న కీచక ఎస్ఐని పోలీస్ శాఖ సస్పెండ్ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కోల్లూర్ పోలీస్ స్టేషన్ లో సురేష్ కుమార్ ఎస్ఐగా పనిచేస్తున్నాడు. స్థానికంగా ఉన్న మరో పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న మహిళ కానిస్టేబుల్ కు ఎస్ఐతో పరిచయం ఏర్పడింది. ఇద్దరు ఒక్కటే డిపార్ట్ మెంట్ లో పనిచేస్తుండటంతో ఏర్పడిన ఫ్రెండ్ షిప్ కాస్తా మాయా మాటాలతో లొంగదీసుకున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని మహిళ కానిస్టేబుల్ కోరడంతో ఎస్ఐ రివర్స్ అయ్యాడు. ఈ నేపథ్యంలో సదరు లేడి కానిస్టేబుల్, కోల్లూర్ ఎస్ఐ పై కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంబించారు పోలిస్ అధికారులు. విషయం తెలిసిన ఎస్ఐ సురేష్ కుమార్ పరారీ అయ్యాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్ఐ పై లైంగిక దాడి కేసు నమోదు కాగానే అతడిని సస్పెండ్ చేసినట్టు శేరిలింగంపల్లి డిసిపి శ్రీనివాస్ తెలిపారు..

More articles

Latest article