29 C
Hyderabad
Monday, August 3, 2026

ఉద్యోగ రంగంలో మాదిగలకు తీవ్ర అన్యాయం

Must read

📰 Generate e-Paper Clip

  • ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కనక ప్రమోద్ మాదిగ

నిజామాబాద్ సిటీీ, బతుకమ్మ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  వర్గీకరణ చేయకపోవడం వల్ల మాదిగ జాతి తీవ్రంగా ఉద్యోగ రంగంలో నష్టపోతుందని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కనక ప్రమోద్ మాదిగ అన్నారు.  ఈనెల 16న ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల రాష్ట్ర సదస్సు నిజామాబాద్ జిల్లాలోని శ్రావ్య గార్డెన్ లో  నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టులో ఆమోదించబడ్డ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు అమలు చేయకపోవడం వల్ల మాదిగ జాతి, ఉప కులాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సదస్సులో మందకృష్ణ మాదిగ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా తొందరగా వర్గీకరణ చేయకపోతే  ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ సదస్సుకు 33 జిల్లాల ఎమ్మార్పీ శ్రేణులు,  అనుబంధ సంఘాల నాయకులు హాజరవుతారని అన్నారు. నిజామాబాద్ జిల్లాలోని ఎమ్మార్పీఎస్ శ్రేణులు,  అనుబంధ సంఘాల ఉద్యోగస్తులు అధిక మొత్తంలో హాజరై రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షుడు సరికేల పోశెట్టి మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు మైలారం బాలు మాదిగ, ఉద్యోగస్తుల జాతీయ నాయకులు తెడ్డు గంగారాం మాదిగ,  మాదిగ ఉద్యమస్తుల రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్ మాదిగ,  నిజాంబాద్ జిల్లా మాదిగ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు మైలారం గంగాధర్, మారుతి, గద్దల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article