25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

జిల్లాకు త్వరలోనే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ కళాశాల

Must read

📰 Generate e-Paper Clip

  • మ్యానిఫెస్టోలో లేని హామీలను కూడా అమలు  చేస్తున్నాం
  • అధికారంలోకి వచ్చిన పది నెలల్లో ఉద్యోగాలు భర్తీ చేసాం
  • జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యం
  • టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : దసరా కానుకగా జిల్లాకు త్వరలోనే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ కళాశాల మంజూరు చేస్తామని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని తెలిపారు. మ్యానిఫెస్టోలో లేని హామీలను కూడా అమలు  చేస్తున్నామని అన్నారు. నీళ్ళు, నిధులు,నియామకాల కోసం యూపీయే తెలంగాణ ఇచ్చిందని తెలిపారు.  కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 50 వేల వరకు  ఉద్యోగాలు కల్పించామని అన్నారు.  కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో 30 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని అన్నారు.  రుణ మాఫీ విషయంలో ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లలో బి అర్ ఎస్ ఇచ్చిన రుణమాఫీ ఎంత, కాంగ్రెస్ 9 నెలల్లో ఇచ్చిన రుణ మాఫీ ఎంత గమనించాలని సూచించారు. ఆర్థికంగా రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి ఇచ్చారని పేర్కొన్నారు.  అయినా అన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. సోషల్ మీడియాని సోషల్ సెన్స్ లేకుండా వాడుతున్నారని ఆగ్రహం  వ్యక్తం చేశారు. పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది తాత్కాలిక ఆనందం ఇచ్చినా దీర్ఘకాలికంగా బి ఆర్ ఎస్ కు నష్టం జరుగుతుందని అన్నారు. జిల్లా పారిశ్రామిక అభివృద్ధి పై త్వరలో సిఎం తో చర్చిస్తామని తెలిపారు. ప్రాణహిత 20,21 వ ప్యాకేజీ పనులు వేగవంతం చేయిస్తామని పేర్కొన్నారు. జిల్లాకు మెడికల్ కళాశాల ఆవశ్యకత ఉందన్నారు. జిల్లాలో మంచి స్టేడియం నిర్మాణానికి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. బిజెపి, బి అర్ ఎస్ లు ప్రజలను మభ్యపెడుతున్నాయని అన్నారు. అర్ వో బి విషయం లో కేంద్రం నిర్లక్షం గా వ్యవహరిస్తుందని తెలిపారు. నిజామాబాద్ స్మార్ట్ సిటీ రావల్సిన అవసరం ఉందని, ఎంపి అరవింద్ ఆ దిశగా కృషి చేయాలని సూచించారు. వీలైనంత త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలిపారు. బంగారు తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని అన్నారు.  వారి పాలనలో రాష్ట్ర ప్రజలకు చేసింది శూన్యమని  అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన పది నెలల్లో ఉద్యోగాలు భర్తీ చేసామని తెలిపారు.  జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ పార్టీ లక్ష్యంమని అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఉర్డూ అకాడమీ చైర్మన్ తాహెర్, జిల్లా  కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, పిసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, నుడా  ఛైర్మన్ కేశవేణు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article