24 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తాం

Must read

📰 Generate e-Paper Clip

. . . పిట్లంలో 30 పడకల ఆసుపత్రిలో పూజ కార్యక్రమం

. . . జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు

పిట్లం, బతుకమ్మ:

మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ 30 పడకల ఆసుపత్రిలో సోమవారం నిర్వహించిన పూజా కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పాల్గొన్నారు. ఈ నెల 16న మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా ఆసుపత్రిని ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

We will provide better healthcare to the people

 

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని సౌకర్యాలతో ఆసుపత్రిని తీర్చిదిద్దామని పేర్కొన్నారు. అనంతరం ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడిన ఎమ్మెల్యే, వైద్య సేవల్లో ఎలాంటి సమస్యలు ఎదురైనా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ విజయ్ భాస్కర్ రెడ్డి, డిప్యూటీ డిఎంహెచ్ఓ రోహిత్ కుమార్,ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

We will provide better healthcare to the people

More articles

Latest article