28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

మొరం అక్రమ తవ్వకాలపై చీతా ఫోర్స్ మెరుపు దాడి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . 2 జె సి బి లు , 13 ట్రాక్టర్లు స్వాధీనం

 ధర్పల్లి, బతుకమ్మ:

చీత ఫోర్స్ సిబ్బంది  సోమవారం ధర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మైలారం గ్రామంలో పెద్ద వాగు ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అనుమతులు లేకుండా అక్రమంగా మొరం తవ్వకాలు చేస్తు రవాణా జరుపుతున్నారని పోలిస్ కమిషనర్ సాయి చైతన్య కు వచ్చిన సమాచారంతో దాడులు నిర్వహించారు. సిసిఎస్ ఎసిపీ అధ్వర్యంలో మెరుపు దాడి నిర్వహించి మొరం తవ్వకాలు చేస్తున్న 2 జేసీబీ లు, మొరం రవాణాకు వినియోగిస్తున్న 13 ట్రాక్టర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ తవ్వకాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలగడమే కాకుండా, సహజ వనరులు దెబ్బతింటాయని అధికారులు తెలిపారు. అదేవిధంగా వాగులు, చెరువులు పరిసర ప్రాంతాల పర్యావరణ సమతుల్యతను కూడా ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.స్వాధీనం చేసుకున్న వాహనాలు తదుపరి చట్టపరమైన చర్యల కోసం ధర్పల్లి పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ కు అప్పగించారు. సంబంధిత వ్యక్తుల మైనింగ్ ఇతర చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.Cheetah Force launches lightning attack on illegal mining in Moram

More articles

Latest article