29 C
Hyderabad
Monday, August 3, 2026

సీసీ కెమెరాల ద్వారా నేరాలను నియంత్రించవచ్చు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రుద్రూర్ ఎస్సై సాయన్న

 

రుద్రూర్, బతుకమ్మ :

 

మన ఊరు – మన భద్రత, మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా రుద్రూర్ మండలంలోని  బొప్పాపూర్ గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం అవగాహన సమావేశం నిర్వహించారు. గ్రామ భద్రతలో సీసీ కెమెరాల ప్రాధాన్యాన్ని రుద్రూర్ ఎస్సై సాయన్న వివరించారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ద్వారా నేరాల నియంత్రణతో పాటు ప్రజల్లో భద్రతాభావం పెరుగుతుందన్నారు. అదేవిధంగా రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article