29 C
Hyderabad
Monday, August 3, 2026

పెద్దమ్మ తల్లి వార్షికోత్సవంలో భారీగా పాల్గొన్న ముదిరాజులు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . వేడుకలకు హాజరైన జిల్లా అధ్యక్షులు కరాటే రమేష్

 

ఇందల్ వాయి, బతుకమ్మ :

 

సిరికొండ మండలంలో తుంపల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన పెద్దమ్మతల్లి వార్షికోత్సవ వేడుకల్లో ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు కరాటే రమేష్, వివిధ మండలాల అధ్యక్షులు, కార్యదర్శిలు, సీనియర్ నాయకులు హాజరై అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ముదిరాజుల సంఘం జిల్లా అధ్యక్షులు కరాటే రమేష్ మాట్లాడుతూ మండలంలో ప్రజలందరూ పాడిపంటలతో సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు. అనంతరం ముదిరాజుల నాయకులు జిల్లా నాయకులకు ఘనంగా పూలమాల శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు సీనియర్ నాయకులు లోకాని గంగారం, మోచ్చే గోపాల్, ఉంగరాల శ్రీను, లోకాని గంగాధర్, తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

 

Mudirajulu participated in large numbers in the anniversary of Peddamma's mother.

More articles

Latest article