27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

99 రోజుల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని 30 ఏప్రిల్ 2026 నుండి 23 మే 2026 వరకు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా రుద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామంలో శుక్రవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు  కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ సందర్బంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. వ్యవసాయంలో అధిక దిగుబడులు పొందడానికి రసాయనాలు అధికంగా లేదా తప్పుగా వాడితే నేల ఆరోగ్యం, పర్యావరణం మరియు మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉందన్నారు. పంట అవసరాలు, నేలలోని పోషకాల స్థాయి, కీటకాల ప్రబలత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, సరైన మోతాదు, సరైన సమయం, సరైన విధానంలో ఎరువులు, రసాయనాలను వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డా. కె.ఇందుధర్ రెడ్డి శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూరు, మండల వ్యవసాయ అధికారి జి. సాయికృష్ణ, అనీల్ పటేల్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article