29 C
Hyderabad
Monday, August 3, 2026

వన్ మినిట్ రూల్ పాటించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నిజామాబాద్ జిల్లా ఎస్ ఈ పివి రాజేశ్వర రావు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

మనం మన భద్రతను పాటిస్తూ పనులను చేయాలని, వన్ మినిట్ రూల్ న ప్రతి ఒక్కరూ పాటించాలని నిజామాబాద్ జిల్లా ఎస్ ఈ పివి రాజేశ్వర రావు అన్నారు. బుధవారం విద్యుత్ భద్రత వారోత్సవాల్లో భాగంగా గోల్డెన్ జూబ్లీ సమావేశపు హాల్ లో నిజామాబాద్, డిచ్ పల్లి డివిజన్ లోని ఓఎం స్టాప్ తో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సిఎండి సూచించిన విధంగా వన్ మినిట్ రూల్, ఒక్క నిమిషం ఆగండి ప్రతిదీ చెక్ చేసుకున్న తర్వాత, భద్రతాపరంగా ఎల్ సి, ఎర్తింగ్, హ్యాండ్ గ్లౌజ్, టెస్టర్, పరికరాలు, మెటీరియల్ ప్రతిదీ చూసుకొని పనిని ప్రారంభించాలని అన్నారు.

 

Follow the one minute rule.

 

మన ఇంటి వద్ద మన కుటుంబ సభ్యులు ఎదురుచూస్తారని మర్చిపోవద్దని, ఏఈలు కూడా ప్రతిరోజు పెప్ టాక్ లో వన్ మినిట్ రూల్ తప్పకుండా చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో డి ఈ టెక్నికల్ ఏ.రమేష్, డి ఈ ఆపరేషన్ నిజామాబాద్ ఎం శ్రీనివాసరావు, డి ఈ ఆపరేషన్ డిచ్ పల్లి హరిచంద్, ఏడీఈలు, ఏ ఈ లు, సబ్ ఇంజనీర్స్, రెండు డివిజన్ల ఓ ఎం, డి ఎం స్టాఫ్ పెద్ద ఎత్తున పాల్గొని భద్రత ప్రతిజ్ఞను చేశారు.

More articles

Latest article