భిక్కనూరు, బతుకమ్మ :
భిక్కనూర్ మండల కేంద్రంలో లాండ్రీ దుకాణంలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం సంబంధించింది. సుమారు రెండు లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా. మండలానికి చెందిన ముత్తన్న గళ్ళ నర్సింలు చిన్న ల్యాండ్ షాప్ మొత్తం దగ్ధమైంది. షాప్ నుంచి మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు, స్థానికులు కలిసి మంటలను ఆర్పారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు పంచనామ నిర్వహించి రెండు లక్షల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు.
