24 C
Hyderabad
Sunday, August 2, 2026

డబుల్ బెడ్ రూం ఇళ్లను పంపిణీ చేయకపోవడం లోటుగా ఉంది

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మల్యాల గోవర్ధన్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

న్యాయస్థానంలో కేసు గెలిచినప్పటికీ, ప్రజలకు ఇప్పటికి ఆ డబుల్ బెడ్ రూం ఇళ్లను పంపిణీ చెయ్యకపోవడం లోటుగా ఉందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మల్యాల గోవర్ధన్ అన్నారు. 2013 లో నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని పోరాటం చేసిన నాయకులు మల్యాల గోవర్ధన్, మధు, శంశోధిన్, అన్వర్, రామచందర్, యోగేష్, రాజు, కమల, మల్లేశ్, రాజేందర్ లపై ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసు 13 సంవత్సరాల అనంతరం ఒక కొలిక్కి వచ్చింది. మంగళవారం ఆ కేసును న్యాయస్థానం కొట్టివేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ స్థలంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల ను నిర్మించినా ప్రభుత్వం ఇప్పటికీ పంపిణీ చేయలేదన్నారు. ఇప్పటికైనా నేటి కాంగ్రెస్ పార్టీ ఆ డబుల్ బెడ్ రూం ఇళ్ల ను పేదలకు అందజేస్తే మా ఈ పోరాటానికి సార్ధకత ఉంటుందని ఆయనన్నారు. అనంతరం కేసు వాదించిన న్యాయవాదులు ఆశ నారాయణ, రవి లకు ధన్యవాదాలు తెలిపారు.

More articles

Latest article