27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

కాల్పులలో గాయపడ్డవారిని పరామర్శించిన కేటిఆర్

Must read

📰 Generate e-Paper Clip

 

కరీంనగర్, బతుకమ్మ :

 

కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాపు కాల్పుల ఘటనలో గాయపడ్డ బాధితులను మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పరామర్శించారు. సోమవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో బాధితులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో వారిని పరామర్శించిన కేటిఆర్ బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని వైద్యులను కోరారు. అలాగే బాధితులు ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన దుండగులను ప్రభుత్వం తక్షణమే అదుపులోకి తీసుకొని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేటిఆర్ వెంట మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, గంగుల కమాలకర్, ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డి, నారదాసు లక్ష్మణ్ రావు తదితరులు ఉన్నారు.

 

KTR visits those injured in the shooting

More articles

Latest article