. . . చెరువులో పూడికతీత పనులను పరిశీలించిన రెవిన్యూ, ఇరిగేషన్ అధికారులు
రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండల కేంద్రంలో గల చెరువులో రాత్రి వేళలో జెసీబి సహాయంతో అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తూ ట్రాక్టర్లలో తరలిస్తున్నారని “అంతా నా ఇష్టం.. మాకెవరు అడిగేది?”.. “చెరువులో రాత్రి వేళలో అక్రమంగా మట్టి తవ్వకాలు ” అనే శీర్షిక పై బతుకమ్మ పత్రికలో రెండు రోజుల క్రితం ప్రచురితమైన వార్త కథనానికి సోమవారం రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు స్పందించారు. తహశీల్దార్ తారాబాయి, ఆర్ ఐ రాజేష్, డిప్యూటీ తహశీల్దార్ సురేందర్ నాయక్, ఇరిగేషన్ డిఈఈ మహమ్మద్ రఫీ, ఏఈ శృతిలు చెరువులో పూడికతీతను పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

