27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

బాధ్యతలు స్వీకరించిన నూతన సీఐ

Must read

📰 Generate e-Paper Clip

 

భిక్కనూరు, బతుకమ్మ :

 

భిక్కనూరు సిఐ గా జగడం నరేష్ సోమవారం బాధ్యత చేపట్టారు. ఇక్కడ పనిచేసిన సీఐ సంపత్ ఐజిపి మల్టీ జోన్ హైదరాబాద్ కు పంపడంతో ఆ స్థానంలో జగడం నరేష్ ని నియమించారు. ఈ సందర్భంగా సర్కిల్ కార్యాలయానికి చేరుకున్న ఆయన బాధ్యతలు చేపట్టారు. సిఐ మాట్లాడుతూ శాంతి భద్రత విషయంలో రాజీలేకుండా పనిచేస్తామన్నారు. ఆ సాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. బెట్టింగ్, గంజాయి, పేకాట సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. బాధ్యతలు స్వీకరించిన సిఐ కి ఎస్సై ఆంజనేయులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.

More articles

Latest article