25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

అస్తమా నియంత్రణలో ప్రజల అవగాహన కీలకం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . డా. ప్రశాంత్ పల్మోనాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

అస్తమా వ్యాధి పై ప్రజల్లో అవగాహన కల్పిస్తేనే అస్తమాని నివారించవచ్చని పల్మోనాలజిస్ట్ డా.ప్రశాంత్ అన్నారు. ప్రతి సంవత్సరం మే నెలలో మొదటి మంగళవారం ప్రపంచ ఆస్తమా దినోత్సవంగా నిర్వహించబడుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అస్తమా అనేది శ్వాసనాళాలపై ప్రభావం చూపే దీర్ఘకాలిక వ్యాధి అని, దీనివల్ల దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతిలో బిగుతు వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, అలర్జీ సమస్యలు ఉన్నవారు ఎక్కువగా ప్రభావితమవుతారని తెలిపారు. అస్తమాను పూర్తిగా నయం చేయలేకపోయినా, సరైన చికిత్స, ఇన్ హెలర్ వినియోగం, వైద్యుల సూచనలు పాటించడం ద్వారా నియంత్రణలో ఉంచవచ్చని ఆయన పేర్కొన్నారు. దుమ్ము, పొగ, కాలుష్యం వంటి కారణాలను దూరంగా ఉంచుకోవడం అవసరమని సూచించారు. ప్రజలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించి, శ్వాస సంబంధిత సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.

More articles

Latest article