మాక్లూర్, బతుకమ్మ :
అప్పుల బాధతో యువకుడు ఇంట్లో ఊరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లా మాక్లుర్ మండలం చిక్లి గ్రామంలో చోటు చేసుకుంది. భార్య తెలిపిన వివరాల ప్రకారం మృతుడు బోదాస్ నాగరాజు వయసు 32 సంవత్సరాలు కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృశ్యా ట్రాక్టర్ డ్రైవర్ గా కూలి పని చేసుకుంటూ తన భర్త నాగరాజు జీవనం సాగిస్తూ ఉండేవారని గత కొంతకాలంగా బైక్ ఫైనాన్స్, వ్యవసాయ క్రాప్ లోన్, గోల్డ్ లోన్లతో ఇబ్బంది పడుతూ బాధపడేవారని కూలీ పని చేసుకుంటా అప్పు ఎలా తీర్చాలో బాధపడుతూ ఉండేవాడన్నారు. మృతుడి భార్యను బోదాస్ వైష్ణవి తన అత్తగారిల్లు అయిన కుర్నాపల్లి గ్రామానికి పంపించి తల్లిని తన కూతుర్ల వద్దకు పంపించి ఎవరు లేని సమయంలో ఇంట్లోనూ ఫ్యాన్ తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. భార్య బోధస్ వైష్ణవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై మొగులయ్య తెలిపారు.
