24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఘనంగా మే డే ఉత్సవాలు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం (మేడే) సందర్భంగా జిల్లా కేంద్రంలోని మూడవ డివిజన్ గూపన్ పల్లి గ్రామంలో స్థానిక కార్పొరేటర్ ప్రసూన శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మేడే ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ కార్మిక జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రామిక, కర్షక, కార్మికుల రెక్కల కష్టం వెలకట్టలేనిదని, వారి త్యాగం అసమానమైనదన్నారు. తమ శ్రమతో దేశ ప్రగతికి బాటలు వేస్తున్న కార్మిక, కర్షక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మున్సిపల్ కార్మికులకు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

 

May Day celebrations in full swing

More articles

Latest article