నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :
జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ నాల్సా న్యాయవ్యస్థలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ అనే విప్లవాత్మకమైన మార్పును తీసుకువచ్చిందని తెలంగాణ రాష్ట్ర న్యాయసేవ అధికార సంస్థ సభ్య కార్యదర్శి సిహెచ్ పంచాక్షరీ తెలిపారు. పేదలు, బడుగు బలహీన వర్గాలకు ఉచిత న్యాయసేవలు అందిస్తు లీగల్ ఎయిడ్ సిస్టమ్ యజ్ఞంలా విధులు నిర్వహిస్తున్నదని ఆయనన్నారు. నిజామాబాద్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ చీఫ్ రాజ్ కుమార్ సుబేధార్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ మహమ్మద్ షాదుల్ల, ఉదయ కృష్ణ, శుభం, బాలాజీ, మహిపాల్, ప్రమోద్, ప్రవీణ, లక్ష్మీ నారాయణ లు నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవ సదన్ లో కలిసి మెమెంటో, శాలువతో సత్కరించిన సందర్బంలో జడ్జి పంచాక్షరీ మాట్లాడారు. ఆర్థిక వెనుకబాటుతనంతో ఎవరు కూడా న్యాయసేవలు అందుకుంట పోరాదనే రాజ్యాంగ లక్ష్యానికి అనుగుణంగా సంస్థ కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని తెలిపారు.
