29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులు భూసారాన్ని పెంపొందిస్తాయి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఎన్ఎస్ఎస్ క్యాంప్ లో వక్తలు

 

డిచ్ పల్లి, బతుకమ్మ :

 

తెలంగాణ విశ్వవిద్యాలయ ఎన్ఎస్ఎస్ యూనిట్-II డిచ్‌పల్లి గ్రామంలో నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాన్ని 6వ రోజు ఉత్సాహంగా కొనసాగింది. జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్), యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ శిబిరం గ్రామ సేవా కార్యక్రమాలు, యువత అభివృద్ధి లక్ష్యాలతో పనిచేస్తుంది. బుధవారం వ్యవసాయ అవగాహన కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ, తెలంగాణ ప్రభుత్వం, మట్టి పరీక్షా ప్రయోగశాల సహాయ వ్యవసాయ సంచాలకురాలు కె. దైవ గ్లోరీ శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మట్టి పరీక్షల ప్రాముఖ్యతను వివరించి, పంటల దిగుబడులు పెరగడం, నేల సారాన్ని కాపాడుకోవడంలో శాస్త్రీయ విశ్లేషణ అవసరాన్ని తెలియజేశారు. అలాగే ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో), సహకార మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం జిల్లా మేనేజర్ జి.ఎస్.శివ రామ కృష్ణ మాట్లాడుతూ నానో ఎరువుల ప్రయోజనాలపై ప్రసంగించి, ఇఫ్కో నానో యూరియా, నానో డ్యాప్ లిక్విడ్ వినియోగం ద్వారా వ్యవసాయ సామర్థ్యం పెరగడం, పర్యావరణానికి మేలు కలగడం, “సహకార్ సే సమృద్ధి” లక్ష్య సాధనలో వాటి పాత్రను వివరించారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు గ్రామ చెరువు, లక్ష్మీనరసింహ స్వామి ఆలయం పరిసరాల్లో కలుపు మొక్కలు, ముళ్ల పొదలను తొలగిస్తూ పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలను ఎన్ఎస్ఎస్ యూనిట్-II ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. అహ్మద్ అబ్దుల్ హలీం ఖాన్ పర్యవేక్షి స్తున్నారు.

More articles

Latest article