. . . కామారెడ్డి జిల్లా ఇన్ చార్జి మంత్రి సీతక్క
కామారెడ్డి, బతుకమ్మ :
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ కావడమే లక్ష్యమని, ఇందిరమ్మ ఇళ్ల ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు సొంతింటి కల సాకారం అవుతోందని మంత్రి సీతక్క అన్నారు.

కామారెడ్డి మండలంలోని గూడెం గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా ఇన్ చార్జి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారుడి ఇంటికి గృహప్రవేశం చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి సీతక్క కామారెడ్డి పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, మండల అధ్యక్షులు గూడెం శ్రీనివాస్ రెడ్డి తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

