29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

డిప్యూటి సీఎం ని కలిసిన ఎమ్మెల్యే మదన్ మోహన్

Must read

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మదన్ మోహన్ మరో కీలక అడుగు వేశారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని మంగళవారం మర్యాదపూర్వకంగా కలుసుకుని, నియోజకవర్గంలోని అత్యవసర సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న లింగంపల్లి ఖుర్ద్ బ్రిడ్జ్, అడ్విలింగాల్ బ్రిడ్జ్‌ల నిర్మాణానికి తక్షణ నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ రెండు వంతెనలు పునర్నిర్మాణం అయితే రైతులకు, సాధారణ ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడి, రోజువారీ కార్యకలాపాలు సులభతరం అవుతాయని ఆయన వివరించారు. అదేవిధంగా నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి కావడానికి కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులను సమయానికి విడుదల చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ అంశాలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.

More articles

Latest article