డిప్యూటి సీఎం ని కలిసిన ఎమ్మెల్యే మదన్ మోహన్
హైదరాబాద్, బతుకమ్మ : ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మదన్ మోహన్ మరో కీలక అడుగు వేశారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని మంగళవారం మర్యాదపూర్వకంగా కలుసుకుని, నియోజకవర్గంలోని అత్యవసర సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న లింగంపల్లి ఖుర్ద్ బ్రిడ్జ్, అడ్విలింగాల్ బ్రిడ్జ్‌ల నిర్మాణానికి తక్షణ నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ రెండు వంతెనలు పునర్నిర్మాణం అయితే రైతులకు, సాధారణ ప్రజలకు రవాణా సౌకర్యాలు...